సహకరించకపోతే, ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లని కాల్చి చంపాలి, బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు, ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ బాంబు పేలింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు దేశంలో కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. అక్కడ జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మందిలో చాలామందికి కరోనా వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఆ కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో కలకలం రేగింది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు స్వచ్చందంగా తమ వివరాలు తెలపాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని వైద్య పరీక్షలకు సహకరించని వారిని కాల్చి చంపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే వైరస్ మరింత మందికి వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ మర్కజ్ లో పాల్గొన్నవారిని వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ ప్రార్థన సభకు తెలంగాణ, ఏపీ నుంచే కాక, దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని వివరించారు. అంతేకాక, ఇండోనేషియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని తెలిపారు. మార్చి 13 నుంచి 15 మధ్య ఈ సభ జరిగిందని, దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రాజాసింగ్ నిలదీశారు. ఈ మేరకు మంగళవారం(మార్చి 31,2020) ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మర్కజ్ లో జరిగిన మతపరమైన సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌లుగా తేలుతుండడంతో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అలాంటివారిని కాల్చి పారేయాలని రాజాసింగ్ అన్నారు. వారిని చంపి దేశాన్ని, తెలంగాణ, ఏపీని కాపాడుకోవాలన్నారు. కొంతమంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని, ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని రాజాసింగ్ సూచించారు. ఒక వేళ సహకరించకపోతే వారిని నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి చంపి, తమ రాష్ట్రాలను కాపాడుకోవాలని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి గురించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వానికి, వైద్య పరీక్షలకు సహకరించకపోతే కాల్చి చంపాలని అనడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. సమస్యకు ఇది పరిష్కారం కాదన్నారు. ఈ పరిస్థితుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. సంయమనం కోల్పోకుండా పరిస్థితిని డీల్ చేయాలన్నారు.
Also Read | చైనా…అంతమంది చనిపోతే అబద్ధాలు చెబుతావా?