LB స్టేడియంలో మోడీ సభ..ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 08:06 AM IST
LB స్టేడియంలో మోడీ సభ..ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

Updated On : April 1, 2019 / 8:06 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో
బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరానికి రానున్నారు. ఏప్రిల్ 01వ తేదీ సోమవారం ఈ సభ జరుగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. 

పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ జంక్షన్‌ వైపు మళ్లింపు. 
ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి..బిజెఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. 
అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపేల్‌ రోడ్డులోకి అనుమతిస్తారు.
రాజమొహల్లా నుంచి వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి, నారాయణగూడ వైపుగా వెళ్లాలి. 
బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి జిపిఓకు వచ్చే వాహనాలను హైదర్‌గూడ, కింగ్‌ కోఠి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మార్గంలో పంపిస్తారు.
కింగ్‌ కోఠి నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను భారతీయ విద్యాభవన్‌ వద్ద కింగ్‌కోఠి క్రాసు రోడ్డు తాజ్‌ బంజారా హోటల్‌ వైపుగా మళ్లిస్తారు. 
అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్‌ణుంచి హిమాయత్‌నగర్‌ రోడ్‌ వైపు వెళ్లాలి. 
హిల్‌ ఫోర్టు నుంచి వచ్చే వాహనాలు బషీర్‌బాగ్‌ వైపు వెళ్లవద్దు. పిసిఆర్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి రోడ్డు గుండా