కేసీఆర్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 04:25 AM IST
కేసీఆర్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు

Updated On : February 12, 2019 / 4:25 AM IST

హైదరాబాద్ : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజులకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్‌ లో కేసీఆర్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని జలవిహార్‌ లో పలు కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తలసాని తెలిపారు. పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని, తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించనున్నాయని తలసాని తెలిపారు.