కేసీఆర్ ఆందోళన : ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గింది

తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 07:33 AM IST
కేసీఆర్ ఆందోళన : ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గింది

Updated On : September 9, 2019 / 7:33 AM IST

తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన

తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన ఏడాదిన్నరగా దేశం తీవ్ర  ఆర్థిక మాంద్యంలో ఉందని కేసీఆర్ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందని అన్నారు. 2019 తొలి త్రైమాసికంలో కేవలం 5శాతమే వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం  చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వెల్లడించారు. 11శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయిందన్నారు.  ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించాల్సి వచ్చిందన్నారు.

దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపైనా ఉందని, ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గిందని కేసీఆర్‌ అన్నారు. ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన చేశామన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తూ ఉంటామన్నారు. మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు. 18 నెలలుగా ఆర్థిక మాంద్యం స్థిరంగా కొనసాగుతోందన్నారు.

ఆర్థిక మాంద్యం రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపింది. బడ్జెట్ లెక్క తగ్గింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించింది ప్రభుత్వం. రూ.1.46 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. వ్యవసాయం, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు. మూల ధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.67 కోట్లు. ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.