కేసీఆర్ ఆదేశం : విద్యా వ్యవస్థలో నైతిక విలువలు పెంచాలి

హైదరాబాద్: చిన్ననాటి నుండి చదువుకున్న పాఠాలు..వారి పుట్టిన పెరిగిన పరిస్థితులే చిన్నారులను భావి భారత పౌరులుగా..నైతిక విలువలు వంటి పలు కీలక విషయాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చిన్ననాటి నుండి పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు..సమాజంలో వారు బాధ్యత కలిగినవారిగా మసలుకొనేలా తీర్చిదిద్దేందుకు ఎడ్యుకేషన్ దశ నుండే రావాలని కేసీఆర్ భావించారు. ఈ యోచనతో అన్ని తరగతుల్లోనూ నైతిక విలువలతో కూడిన విద్య వుండాలనీ..దానికి సంబంధించిన స్పెషల్ బుక్స్ ప్రింట్ చేయించాలని విద్యాశాఖను ఆదేశించారు.
చిన్నారులకు పేరెంట్స్, టీచర్స్, పెద్దల పట్ల విధేయతతో పాటు బాధ్యత కలిగేలా నైతిక విద్యను అమలు చేయాలని కేసీఆర్ సూచించారు. కులమతాలకు అతీతంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి మహనీయుల గురించి పాఠాల్లో చేర్చాలని.. ప్రముఖ వ్యక్తులను గౌరవించేలా లెసన్స్ ఉండాలని విద్యాశాఖను ఆదేశించారు. సోషల్ సబ్జెక్ట్ లో మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం ప్రాముఖ్యత.. పంచాయతీరాజ్ విధానం, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రత్యేకత వంటి పలు కీలక అంశాలను కూడా చేర్చాలని సీఎం ఆదేశించారు. భారత గణతంత్ర దినోత్సవం (జనవరి 26), తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2)ను సందర్భంగా చిన్నారులతో వ్యాస రచన, వక్తృత్వ పోటీలను స్కూల్స్ లో నిర్వహించాలని..కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎం ఆఫీస్ నుండి స్పెషల్ అధికారి దేశపతి శ్రీనివాస్ ప్రకటించారు.