ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు అమరులు

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోదన్నారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శాంతి భద్రతల కోసం, సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని సీఎం కొనియాడారు.