చర్చల్లేవ్, హైపవర్ కమిటీకి నో : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం 

ఆర్టీసీ భవిష్యత్‌ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 06:06 AM IST
చర్చల్లేవ్, హైపవర్ కమిటీకి నో : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం 

Updated On : November 13, 2019 / 6:06 AM IST

ఆర్టీసీ భవిష్యత్‌ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి

ఆర్టీసీ భవిష్యత్‌ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి హైకోర్టులో ఇవాళ(బుధవారం నవంబర్ 13,2019) మరోసారి విచారణ జరగనుంది. అయితే.. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వాన్ని కానీ, ఇటు కార్మికులను కానీ తాము ఆదేశించలేమన్న కోర్టు… మధ్యేమార్గంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామని.. దీనిపై ప్రభుత్వ నిర్ణయమేంటో తెలపాలని ఆదేశించింది. దీంతో ఆర్టీసీ స్టీరింగ్ మళ్లీ సర్కార్‌ చేతికి వచ్చింది. కోర్టు సూచనపై ప్రభుత్వం తన నిర్ణయమేంటో చెప్పబోతోంది. అయితే… దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. కోర్టులో ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్టీసీ సమస్య కొలిక్కి వచ్చినట్టే. ఆర్టీసీని ఏం చేయాలి?, ఏం చేయకూడదనే అంశాలను కమిటీ పరిశీలించి రిపోర్టు ఇస్తుంది కాబట్టి.. అప్పటివరకు విధుల్లో చేరాలని హైకోర్టు కార్మికులకు సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్న కార్మికులు అందుకు అంగీకరించే అవకాశం కూడా ఉంది. అయితే… ముఖ్యమంత్రి నిర్ణయం ఏంటనేది ఇపుడు చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ఓకే చెబితే.. ప్రభుత్వం తన చేతిలో ఉండే హక్కులను కోల్పోవాల్సి వస్తుందా?… ఆర్టీసీ విషయంలో ఆ కమిటీ అభిప్రాయాలు, కేసీఆర్ అభిప్రాయాలు ఒకేలా ఉంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. మంగళవారం(నవంబర్ 12,2019) రాత్రి 2 గంటల పాటు జరిపిన ఈ సమీక్షలో..  కమిటీకి అంగీకరిస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి? అంగీకరించకపోతే.. కోర్టు ఎలా ముందుకు వెళ్లనుందనే అంశాలపై సీఎం ఆరా తీశారు. మరోవైపు.. రూట్ల ప్రైవేటీకరణపైనా ఇవాళ విచారణ జరగనున్నందున… ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై సమాలోచనలు జరిపారు. ప్రజా ప్రయోజనాల కోణంలో.. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు కేసీఆర్. 

అయితే.. ఇంతదాకా వచ్చిన తర్వాత మళ్లీ చర్చలకు వెళ్లడం అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక శాఖతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కార్మిక నేతలు బయటకు వచ్చేశారని, అలాంటపుడు మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తోంది. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. 

ఓవైపు.. చర్చలకు ఛాన్సే లేదని ప్రభుత్వం చెబుతుంటే… మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం చర్చలకు ఇప్పటికైనా సిద్ధమేనంటోంది. హైపవర్ కమిటీ నియామకం తమకు సమ్మతమేనని… అదే జరిగితే సమ్మె కొనసాగింపు నిర్ణయాన్ని పునరాలోచిస్తామని చెబుతున్నారు. అయితే… బంతి సర్కార్ కోర్టులో ఉన్నందున.. ఆర్టీసీ భవిష్యత్ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. హైపవర్ కమిటీపై ప్రభుత్వం అభిప్రాయం చెప్పిన తర్వాత.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.