నటుడు వేణుమాధవ్ కన్నుమూత

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 07:15 AM IST
నటుడు వేణుమాధవ్ కన్నుమూత

Updated On : September 25, 2019 / 7:15 AM IST

ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇతని  స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. 1997లో సంప్రదాయం సినిమాతో చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి ప్రేమ సినిమాతో ఆయన మంచి గుర్తింపు వచ్చింది. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ఇతను చనిపోయినట్లు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం వదంతులు వ్యాపించాయి. కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

సినీ హాస్యనటుడు వేణుమాధవ్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఆయన సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. కాలేయం, కిడ్నీ సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు డాక్టర్లు.

ఆరోగ్య సమస్యల కారణంగానే చాలారోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం మరింత విషమంగా మారటంతో.. 2019, సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు వేణుమాధవ్.
Read More : నటుడు వేణుమాధవ్ కు తీవ్ర అనారోగ్యం