ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై జగ్గారెడ్డి కామెంట్స్

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై కాంగ్రెస్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 10:27 AM IST
ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై జగ్గారెడ్డి కామెంట్స్

Updated On : January 18, 2019 / 10:27 AM IST

ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై కాంగ్రెస్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి స్పందించారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. జనవరి 18 మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ లో చేరడానికి గల కారణాలను ఒంటేరు అనుచరులకు వివరించారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై కాంగ్రెస్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ ఎస్ లోకి వెళ్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఒంటేరు ఆర్థికంగా చితికిపోయారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పై పోరాటంలో ఒంటేరుపై అనేక కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 

ప్రతాప్ రెడ్డి నాయకుడిగా బలహీనుడు కాడని… పరిస్థితులు ఆయన్ను బలహీనుడిగా మార్చాయని చెప్పారు. ప్రతాప్ రెడ్డి పార్టీ మారడాన్ని వ్యక్తిగతంగా తాను తప్పుపట్టనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ బలహీనుడు టీఆర్ఎస్ కు ఆకర్షితుడేనని తెలిపారు. ’టీఆర్ఎస్ ప్రభుత్వం నో కామెంట్’ అని అన్నారు. బతికినంత కాలం కాంగ్రెస్ లోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తో కొట్లాడే అవసరం తనకు లేదన్నారు. పార్టీ వేరు, రాజకీయం వేరు, అభివృద్ధి వేరని పేర్కొన్నారు. తన అవసరం వారికి లేదు.. కానీ వారి అవసరం తనకు ఉందన్నారు.