కరీంనగర్‌లో కరోనా కలకలం, 13మందిలో వైరస్ లక్షణాలు

కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 08:38 AM IST
కరీంనగర్‌లో కరోనా కలకలం, 13మందిలో వైరస్ లక్షణాలు

Updated On : March 16, 2020 / 8:38 AM IST

కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు

కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు వచ్చారు. పోలీసుల సహకారంతో వారందరికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా అనుమానంతో ఆ 13మందిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్ వో సుజాత చెప్పారు.

తెలంగాణలో మూడో కరోనా కేసు:
కాగా, తెలంగాణలో మూడో కరోనా కేసు నమోదైంది. నెదర్లాండ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసిలో కరోనాను నిర్ధారిస్తూ పుణె ల్యాబ్‌ ఫలితాలను వెల్లడించింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు వెల్లడవ్వడంతో.. ఇప్పటివరకూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు ఇటీవల గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా అనుమానితులు 22 మంది కొత్తగా ఆసుపత్రుల్లో చేరగా.. వీరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. 

గాంధీ ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు:
తెలంగాణపై కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం అదేశాలతో సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇప్పటికే 15రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేయించింది. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే సర్కార్ అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్ అని తేలితే.. ఐసోలేషన్ వార్డుకు తరలించి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునే వరకూ చికిత్స చేయించాలని నిర్ణయించుకుంది. ఇక రాష్ట్రంలో ఒక డెత్ కేసు లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం.. దీని కోసం గాంధీ ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. 

కరోనా ఆసుపత్రిగా గచ్చిబౌలి స్టేడియం:
తెలంగాణతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో కరోనా పాజటివ్ కేసులు ఎక్కువైతే.. వారికి వైద్య పరీక్షలు చేసి చికిత్సలు చేసేందుకు తాత్కాలికంగా ఐసోలేషన్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటుంది. కరోనా అనూమానితులు, బాధితులను జబ్బు నయం అయ్యే వరకూ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వికారాబాద్‌లోని హరితా రిసార్ట్స్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. దీంతో పాటు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మరో ఐసోలేషన్ ఆసుపత్రికి, నగర శివారులోని అటవీ ప్రాంతమైన దూలపల్లిలో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 2వేల 20పడకలతో ఈ మూడు ఆసుపత్రులను అందుబాటులో ఉంచేందుకు వైద్య శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరణ:
అంతర్జాతీయ విమానాల్లో రాష్ట్రానికి వస్తున్న ప్రతి ఒక్కరి సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్‌ అధికారుల సహకారం తీసుకుంటుంది. పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడూ స్కానింగ్‌ చేసి ఆరోగ్యశాఖ అంతర్గత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. సమాచార డిజిలీకరణ ద్వారా ఏ జిల్లాలో, ఏ ఊళ్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులున్నారనే సమాచారం అన్ని జిల్లాల వైద్యాధికారుల వద్ద ఉంటుంది. ఈ సమాచారం ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రయాణికుల నివాసిత ప్రాంతాలను గుర్తించడం తేలికవుతుంది. ముందే సేకరించిన సమాచారం ఆధారంగా వారి నివాసిత ప్రాంతాలను గుర్తించి, ఇంటికెళ్లి వారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Also Read | అంబానీ సూచించిన నత్వానీకి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్