హైదరాబాద్ ఎల్బీనగర్ లో కరోనా కలకలం
హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్

హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్
హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్ ఉండటంతో ఆర్టీసీ అధికారులు నిలదీశారు. ఇటీవలే అతడు దుబాయ్ నుంచి ముంబై వచ్చాడు. ముంబై ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కొవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో శుక్రవారం(మార్చి 20,2020) మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరారు. ఇటలీలో పరిస్థితులను చూసి అందరూ అర్ధం చేసుకోవాలని ఆరోగ్య మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. బుధవారం(18 మార్చి 2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా గురువారం(19 మార్చి 2020) మూడు కేసులు పాజిటివ్ అని తేలాయి. శుక్రవారం(20 మార్చి 2020) మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
See Also | గబ్బిలం, పాంగోలిన్.. కరోనా వైరస్‌కు అసలు కారణం ఏంటి
లండన్ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్ యువతికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బాధితురాలికి చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియా మత ప్రచారకుల బృందంలో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోనేసియా బాధితుల్లో 27 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బృందంలో ఇప్పటికే ఏడుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. విద్యాసంస్థలు, బార్లు, జిమ్‌లు, పార్క్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.