పెంపుడు కుక్క చనిపోయిన బాధలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 04:47 AM IST
పెంపుడు కుక్క చనిపోయిన బాధలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

Updated On : April 18, 2019 / 4:47 AM IST

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుక్క చనిపోయింది. దీంతో పూరీ తీవ్రంగా బాధపడుతున్నాడు. పూరీ జగన్నాథ్ ఇల్లు ఒక చిన్నపాటి జూని తలపిస్తుంది. జంతువుల్ని..పక్షుల్ని పెంచుతుంటారు. వీటన్నింటిలో పూరీకి జాక్స్ అనే కుక్క అంటే పూరి జగన్నాధ్ కు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రాణప్రదంగా చూసుకుంటాడు. సినిమాలలో ఎంతటివారికైనా ఆర్థిక ఒడిదుడుకులు సర్వసాధారణం. ఈ క్రమంలో పూరీ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడిన సమయంలో జాక్స్ ను  పోషించలేక దాన్ని స్నేహితుడ్ని పెంచుకోమని ఇచ్చాడట. అప్పటి నుంచి జాక్స్ పూరి పై కోపం అట. ఇప్పుడు ఆ కుక్క (జాక్స్ ) చనిపోయింది. దీంతో పూరీ స్వంత మనిషి చనిపోయినట్లుగా బాధపడుతున్నాడు. 
 

తన పెంపుడు కుక్క జాక్స్ మరణించిందనీ పూరి ఎమోషనల్ గా ట్విట్ చేయడమే కాకుండా తన పెంపుడు కుక్క ఫోటోలను షేర్ చేస్తూ ఆ కుక్కకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసినట్లు వెల్లడించాడు. ఈ విషాదంలో పూరి చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ‘వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. ఒకానొక టైంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేశాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు’ మళ్లీ తీసుకొచ్చాక నా దగ్గరకు వచ్చేవాడు కాదు, నా వైపు చూసేవాడు కాదు. తోక కూడా ఊపి ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. నేను లైఫ్‌లో ఎంత మందిని బాధపెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను’ అంటూ ఎమోషనల్ గా పూరి ట్విట్ చేసాడు.