దిశ హత్యాచారం.. నిందితుల ఎన్ కౌంటర్ : 10 రోజులు..20 పరిణామాలు
దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పదిరోజుల్లో ఒక్కోరోజు ఏం జరిగింది…? అన్న విషయాల్ని డీటెయిల్‌గా చూద్దాం… నవంబర్ 27 రాత్రి దిశపై మృగాళ్లు దాడి చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు… దిశను అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేశారు. పోలీసులకు దొరకకుండా… రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి బ్రిడ్జి కింద పెట్రోల్ పోసి డెడ్‌బాడీని తగలబెట్టి అక్కడి నుంచి పరారయ్యారు దుర్మార్గులు.
ఆ తర్వాత రోజు నవంబర్ 28న కాలుతున్న దిశ మృతదేహాన్ని ఓ పాల వ్యాపారి చూశాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చూసినప్పటికీ… చలిమంటగా భావించి వెళ్లిపోయాడు. అయితే 7 గంటల సమయంలో తిరిగి వస్తున్నప్పుడు కూడా మంటలు రావడం గమనించాడు. వెంటనే బ్రిడ్జి కిందకు దిగి చూడగానే కాలుతున్న మృతదేహం కనిపించింది. దీంతో ఆ పాల వ్యాపారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు… మృతదేహం దిశదిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
పాల వ్యాపారి సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… 24 గంటల్లోనే కేసును చేధించారు. నలుగురు నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై పలు కేసులు నమోదు చేశారు. అత్యాచారంతో పాటు హత్య చేయడంతో నిందితులపై… IPC సెక్షన్ 302, 375, 362 కింద కేసులు నమోదు చేశారు. దిశ అత్యాచారం హత్య జరిగిన 5వ రోజుకి నిందితులను పోలీసులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిందితులను షాద్‌నగర్‌కు తరలించడంతో… అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితులకు ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. మీ వల్ల కాకపోతే దుర్మార్గులను మాకు అప్పగించండి అంటూ… నిరసనగళం వినిపించారు. ఆందోళనకారులను అడ్డుకోవడం పోలీసుకుల చాలా కష్టమైంది. ఆక్రోశంతో బారికేడ్లను సైతం తొలగించి ఆందోళనకు దిగారు. దీంతో నిందితులను బయటకు తీసుకెళ్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని భావించి పోలీసులు… షాద్‌నగర్ స్టేషన్‌లోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
షాద్‌నగర్ స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు… పరిస్థితులు కాస్త చల్లబడ్డాక పకడ్భందీగా భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో నిందితులను సింగిల్ సెల్స్‌లో ఉంచారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీలు లేకుండా విడివిడిగా ఉంచారు. అదే రోజు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులకు మటన్‌తో భోజనం పెట్టారు జైలు సిబ్బంది.
దిశ అత్యాచారం, హత్య ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. ఎక్కడికక్కడ జనం ఆందోళనకు దిగారు. దిశ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని జనం డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనగళం వినిపించారు. దేశవ్యాప్తంగా జనం ఒక్కతాటిపైకి వచ్చారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ నినదించారు. దిశ చిత్రపటానికి నివాళులర్పించారు. నివాళులర్పించడంతోపాటు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలు చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. దిశకు న్యాయం చేయాలన్న డిమాండ్ ఇంకా ఊపందుకుంది.
దిశ ఘటనతో లోక్‌సభ దద్దరిల్లింది. కాంగ్రెస్‌తో పాటు చాలాపార్టీల నేతలు లోక్‌సభలోనే ఆందోళనకు దిగారు. దిశకు న్యాయం చేయాల్సిందిగా నిరసనగళం వినిపించారు. పార్లమెంట్ ఆవరణలో జనం సైతం జస్టిస్ ఫర్ దిశ అంటూ ఆందోళన చేపట్టారు. సరిగ్గా డిసెంబర్ 1న దిశగా నామకరం చేశారు సీపీ సజ్జనార్. పేరు మారుస్తూ… ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. దిశ ఘటనపై షాద్‌నగర్ కోర్టులో విచారణ చేపట్టారు. తొలి రోజు విచారణలో భాగంగా… అత్యాచారం, హత్యపై వివరాలు సేకరించారు. అత్యాచారానికి ముందు ఏం చేశారు…? దిశను ఎలా ట్రాప్ చేశారు…? ఎక్కడ డ్రింక్ చేశారు. ..? మీరే చంపేశారామా…? ఆమే చనిపోయిందా….? ఒకవేళ చంపితే ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాలపై విచారణ చేపట్టి ఆధారాలు సేకరించారు.
రెండో రోజు విచారణలో భాగంగా… దిశను పెట్రోల్‌తో చంపారా…? డీజిల్‌తో చంపారా…? పెట్రోల్‌తో చంపితే ఎక్కడ కొనుగోలు చేశారు…? దిశ మొబైల్‌ను ఏం చేశారన్న అన్న విషయాలపై ఆధారాలు సేకరించారు. మూడో రోజు విచారణలో నిందితులు తప్పు ఒప్పుకున్నారు. దిశ చనిపోలేదని… మేమే చంపామని చెప్పారు. నోరు ముక్కు మూసి చంపిన తర్వాత… పెట్రోల్‌తో కాల్చేశామన్నారు. మొబైల్‌ను భూమిలో పాతిపెట్టామని చెప్పడంతో పాటు… పలు కీలక విషయాలు విచారణలో బయటపడ్డాయి.
దిశ ఘటనను తెలంగాణ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దోషులెవరికైనా శిక్ష పడాల్సిందేనన్నారు. దిశ హత్యకేసు నిందితులను వారం రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ… కోర్టు తీర్పునిచ్చింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లి పూర్తి వివరాలు రాబట్టాలన్న ఆదేశాలతో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు మొగ్గుచూపారు.
నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దర్యాప్తులో భాగంగా చటాన్‌పల్లి దగ్గర సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో.. నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు దాడికి యత్నించారని.. అందుకే ఎన్‌కౌంటర్ చేశామని సీపీ సజ్జనార్ వెల్లడించారు. దాడికి దిగి పారిపోతుండగా.. లొంగిపోవాలని హెచ్చరించామని.. ఐనా.. నిందితులు వినకుండా పారిపోవడానికి ప్రయత్నించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరిపినట్లు తెలిపారు.