16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం…16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు భూగర్భజల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వార్షిక సాధారణ వర్షపాతం 852 మి.మీ. కాగా 721 మి.మీ.గా నమోదైంది. 584 మండలాల్లో 33 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. 254 మండలాల్లో సాధారణం..284 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ నమోదైందని…13 మండలాల్లో దారుణ పరిస్థితులున్నాయని తెలిపింది. 534 బోరుబావుల్లో 67 శాతం నీటిమట్టం పడిపోయిందని తేల్చింది. రాష్ట్ర సగటు భూగర్భ నీటి మట్టం 11.91 మీటర్లుగా నమోదైందని భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించింది.