అదే నిర్లక్ష్యం : మద్యం తాగి బైక్ ను ఢీకొన్న కారు..యువకుడు మృతి

మందుబాబుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవాటెల్ సమీపంలో బీఎం డబ్య్లూ కారు అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. కారుని అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటు వచ్చిన ఓ యువకుడు ఎదురుగా వస్తున్న బుల్లెట్ ను ఢీకొంది. ఈ ఘటనలో బుల్లెట్ పై వస్తున్న అభిషేక్ ఆనంద్ అక్కడిక్కడే మృతి చెందగా..మరో యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నోవాటెల్ నుంచి సైబర్ టవర్స్ వైపు వస్తున్న బీఎండబ్ల్యూ కారు అర్థారాత్రి 12.30 గంటల సమయంలో మీనాక్షీ సైల్యాండ్ వద్ద రాంగ్ రూట్ లో వచ్చింది. వేగంగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న అభిషేక్ మృతి చెందగా..బైక్ పై వెనుక కూర్చున్న యువతికి తీవ్రంగా గాయాలయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.
మద్యం తాగి డ్రైవ్ చేసిన యువకుడు అశ్విన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి టెస్ట్ లు నిర్వహించగా..108 ఎంజీ ఆల్కహాల్ సేవించినట్లు గుర్తించారు. కారులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. దీంతో అశ్విన్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపటం మందుబాబులకు సర్వసాధారణంగా మారిపోయింది. వారి నిర్లక్ష్యానికి అమాయకులు బలైపోతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మందుబాబులపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా..ఎంతగా అవగాహన కల్పిస్తున్నా..వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మద్యం తాగి..వాహనాలు నడుపుతూ..ప్రాణాలు తీసేస్తున్నారు. దీనికి మరో సాక్ష్యం ఈ ప్రమాదం.