దుబాయ్ గోల్డ్ స్మగ్లర్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు దుబాయ్ నుంచి వస్తున్న గోల్డ్ స్మగ్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.17.5లక్షలు విలువ చేసే 550గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. సయ్యద్ అబ్దుల్ హై తమీమ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్‍లో అధిక ధరలకు అమ్మేవ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
నిందితుడు బంగారాన్ని పౌడర్, పేస్ట్, ఆభరణాల రూపంలో అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
గోవాలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ పోలీసులు బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికుడు నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. రూ.18లక్షలు విలువ చేసే బంగారాన్ని పేస్ట్ రూపంలో డాబొలిమ్ ఎయిర్ పోర్టు నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు.
కస్టమ్స్ కమిషనర్ ఆర్ మనోహర్ విచారణ అనంతరం నడుముకు కట్టిన బ్యాండ్‌లో రూ.18.09లక్షల విలువైన బంగారం పేస్ట్ రూపంలో తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
సాధారణంగా దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు పురుషులకు రూ. 50వేల విలువ చేసే బంగారం, మహిళలకు రూ.లక్ష వరకూ అనుమతి ఉంటుంది.