హింట్ ఇచ్చిన నరసింహన్: తెలంగాణ గవర్నర్ మారుతున్నారా?

  • Published By: vamsi ,Published On : August 29, 2019 / 06:48 AM IST
హింట్ ఇచ్చిన నరసింహన్: తెలంగాణ గవర్నర్ మారుతున్నారా?

Updated On : August 29, 2019 / 6:48 AM IST

రెండు తెలుగు రాష్ట్రాలకు 10ఏళ్లకు పైగా గవర్నర్ గా వ్యవహరించిన ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్.. ఇప్పటి తెలంగాణ గవర్నర్.. ఆ పదవి నుంచి దిగిపోనున్నారా? తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్.. తెలంగాణ గౌవర్నర్ బాధ్యతల నుంచి దిగిపోనున్నారా? లేటెస్ట్ గా  గవర్నర్ నరసింహన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలు రాక మానవు.

ప్రపంచ ఛాంపియన్ షిప్ నెగ్గిన పీవీ సింధూ అభినందన కార్యక్రమం రాజ్ భవన్ లో జిరిగింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను కేంద్రం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ కు హరిచందన్ బిశ్వభూషణ్‌ ను నియమించింది. 

అయితే అప్పుడే తెలంగాణకు కూడా మరో గవర్నర్ ను నియమిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే గవర్నర్ నరసింహన్ నే కేంద్రం తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో పీవీ సింధూ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2020లో జరగనున్న ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి అప్పటికీ నేను గవర్నర్‌గా ఉన్నా లేకపోయినా రాజ్ భవన్‌ రావాలంటూ ఆమెకు సూచించారు.

అయితే ని గవర్నర్ నరసింహన్ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. గవర్నర్ ఏదో మాములుగా ఈ మాట అనలేదని అంటున్నారు. ఆయనకు ముందే కేంద్రం నుంచి ఈ మేరకు సూచనలు వచ్చాయని, ఆయన బదిలీపై ఆయనకు ముందే స్పష్టమైన సమాచారం ఉందని అంటున్నారు. అసలు విషయం ఏంటో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.