IND vs SA : ఒకే ఒక ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్.. ఎలైట్ లిస్ట్‌లో క్వింటన్ డికాక్..
ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs SA) దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
IND vs SA T20 matches Quinton de Kock surpasses Rohit and Virat on elite list
IND vs SA : ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. ఈ క్రమంలో డికాక్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 429 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ విషయానికి వస్తే అతడు 394 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో కలిపి డికాక్ 441 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్ 545 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్, దక్షిణాప్రికా జట్ల మద్య జరిగిన టీ20 సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 545 పరుగులు
*క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – 441 పరుగులు
* రోహిత్ శర్మ (భారత్) – 429 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 394 పరుగులు
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 389 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డికాక్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు. ఆ తరువాత 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది.
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (62; 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓట్నెయిల్ బార్ట్‌మాన్ నాలుగు, లుథో సిపమ్లా, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి తలా రెండు వికెట్లు సాధించారు.
