తప్పిన ముప్పు : విడిపోయిన విశాఖ ఎక్స్ ప్రెస్ బోగీలు

  • Published By: chvmurthy ,Published On : November 2, 2019 / 12:41 PM IST
తప్పిన ముప్పు : విడిపోయిన విశాఖ ఎక్స్ ప్రెస్ బోగీలు

Updated On : November 2, 2019 / 12:41 PM IST

భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్  ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడిపించారు.  

ఒడిశా, ఖుర్దా జిల్లాలోని బలూగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో నవంబర్2వతేదీ శనివారం నాడు ఈఘటన జరిగింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. దీంతో రైలు షెడ్యూల్ సమాయానికంటే కొంత ఆలస్యంగా గమ్యస్ధానానికి చేరుకుంటుంది.  

శనివారం ఉదయం గం.10-21 సమయంలో బలుగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎసి -2 టైర్, ఎస్ -1 బోగీల మధ్య కప్లింగ్  ఊడిపోయి ఇంజన్ ఉన్నభాగం ముందుకు వెళ్లి పోయింది. గమనించిన అధికారులు పరిస్ధితిన చక్కదిద్దారు. రైలును బరంపురం, విశాఖపట్నంలోనూ అన్నీ కోచ్ లను తనిఖీ చేస్తామని, రైలు వెంట కోచ్ రిపేరు సిబ్బందిని పంపించినట్లు ఈస్ట్ కోస్టు రైల్వే అధికారులు వివరించారు.