సినీ నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలియగానే ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాగా, ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, మరోవైపు ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.