కొత్త ఓటర్లకు ఉచితంగా గుర్తింపు కార్డుల పంపిణీ

హైదరాబాద్ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 22 హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,95,780 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ ఎపిక్ కార్డులను ఇవ్వాల్సి ఉంది. నగరంలోనే 15 నియోజకవర్గాల్లో అధికారులు (బీఎల్ఓ) ద్వారా ఈ పంపిణీని మార్చి 26 నుంచి ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు పంపిణీ జరగని లక్ష ఓటరు కార్డులతో పాటు ఫిబ్రవరి 22 వరకు పేర్లు నమోదు చేసుకున్న 1.91 లక్షల మందికి ఒకేసారి ఓటరు కార్డులను పంపిణీ చేయనున్నారు. 2.95 లక్షలమందికి కొత్త ఓటర్లకు ఉచిత గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. అంతేకాక మార్చి 15వ తేదీ వరకు అప్లై చేసుకున్న కొత్త ఓటర్లకు కూడా రెండో విడతలో ఉచితంగా కార్డులు ఇవ్వనున్నారు. వీరందరికీ ఉచితంగానే పంపిణీ చేయనుండగా..ఎపిక్ కార్డులు కావాలనుకేనే పాత ఓటర్లు మాత్రం మీసేవా కేంద్రాల్లో రూ.25 చెల్లించి కార్డులు పొందవచ్చని అధికారులు తెలిపారు.
కొత్త ఓటర్లకు పోల్ స్లిప్ లు పంపిణీ
కొత్త ఓటర్లకు ఎపిక్ ల పంపిణీతో పాటు ఓటర్లకు పోల్ స్లిప్ ల పంపిణీని 27 లేదా 28 తేదీల్లోగా ప్రారంభించి ఫిబ్రవరి 5 లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఎపిక్ కార్డుల పంపిణీ కూడా వీటితోపాటే పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు.