తెలంగాణలో ఉచితంగా కరోనా మాస్క్‌లు

  • Published By: vamsi ,Published On : March 6, 2020 / 02:11 AM IST
తెలంగాణలో ఉచితంగా కరోనా మాస్క్‌లు

Updated On : March 6, 2020 / 2:11 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) అనుమానితులు రోజురోజుకు దేశంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇదే విషయమై గట్టిగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే న్యాయస్థానాలు కూడా కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అపరిశుభ్రతే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతుందని కరోనా వైరస్ మురికివాడల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, మురికి వాడల్లోని పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలని, ఈ అంశాన్ని పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సంధర్భంగా చేపట్టిన విచారణలో ప్రస్తుతం గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్సతో పాటు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కోర్టుకు ప్రభుత్వం తరపున లాయర్ వివరించారు.

కరోనా తెలంగాణలో ఉందంటూ వార్తలు వ్యాప్తి చెందడంతో మాస్కుల ధరలను భారీగా పెంచారు వ్యాపారులు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇదే అనువైన సమయంగా భావిస్తున్న వ్యాపారులు మాస్క్‌ల ధరలను ఆమాంతం పెంచేసి కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నారు.

See More :

*  తెలంగాణ అసెంబ్లీ: CAA, NPRలపై సభలో తీర్మానం!

తెలంగాణ బడ్జెట్ 1.6 లక్షల కోట్లు