వీళ్లు మారరు : బతికుండగానే చంపేసిన డాక్టర్లు
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు

సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు ప్రమాదంలో భాను అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. భాను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. భాను తండ్రి పఠాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్లు చనిపోయినట్లు చెప్పడంతో శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. అయితే భాను బతికే ఉన్నట్లు మరో డాక్టర్ తేల్చడంతో.. తిరిగి వైద్య పరీక్షలు ప్రారంభించారు.