రాచకొండ పరిధిలోని 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనం : సీపీ భగవత్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 వేల 900 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 వేల 900 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 వేల 900 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ పరిధిలోని 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనం ప్రక్రియ జరుగుతోందన్నారు. నిన్నటి వరకు 9 వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని చెప్పారు. రేపు ఉదయం 6 గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.
సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. 3 చోట్ల కమాండ్ కంట్రోలో రూమ్ ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 5 వేల 660 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి 520 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రూమర్లు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : గణేష్ నిమజ్జనం : 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు