గుడ్ న్యూస్.. లాక్‌డౌన్‌ ఎత్తివేత, కండీషన్స్ అప్లయ్

దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 02:57 AM IST
గుడ్ న్యూస్.. లాక్‌డౌన్‌ ఎత్తివేత, కండీషన్స్ అప్లయ్

Updated On : April 5, 2020 / 2:57 AM IST

దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన

దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం అందులో భాగంగా లాక్ డౌన్ అమలు చేసింది. ముందు మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. ఆ తర్వాత కండీషన్ సీరియస్ కావడంతో లాక్ డౌన్ ను పొడిగించారు. 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. లాక్ డౌన్ అమలుతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ అయ్యాయి. దుకాణాలు, పరిశ్రమలు మూత బడ్డాయి. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు.

లాక్ డౌన్ తో వలస కూలీల కష్టాలు:
లాక్ డౌన్ తో వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక, తినడానికి తిండి లేక రవాణ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఉన్న చోట ఉపాధి లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో వలస కూలీలు వందల కిలోమీటర్లు కాలి నడకనే తమ స్వస్థలాలకు వెళ్లడం అందరిని బాధించింది. ఇక ఆటోలు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్టు వాళ్లు కూడా అదే పరిస్థితి. జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. మొత్తంగా లాక్ డౌన్ తో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

ఏప్రిల్ 15వ తర్వాత ఏం జరగనుంది?
ఈ క్రమంలో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారు అనేది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 15వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ మర్కజ్ సదస్సు పుణమ్యా అని దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మర్కజ్ సదస్సులో పాల్గొన్న చాలామందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో దేశంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. దీంతో ఏప్రిల్ 15వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ ఎత్తివేసే చాన్స్ లేదేమోనని జనాలు కంగారు పడుతున్నారు.

తెలంగాణలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత:
కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గితే ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే హాట్‌ స్పాట్లలో మాత్రం పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాతనే లాక్‌డౌన్‌ను తొలగిస్తారని అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన ప్రాంతాల్లో కొన్నాళ్లపాటు రాత్రివేళల్లో కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. రాజధానిలో మాత్రం ఇప్పట్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసే పరిస్థితులు లేవని, నమోదవుతున్న కేసుల్లో ఇక్కడే అధికంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన 25 ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ హాట్‌ స్పాట్లుగా గుర్తించింది. వీటిలో 
* హైదరాబాద్‌లోని పాతబస్తీ
* వరంగల్‌ అర్బన్
* నిజామాబాద్‌ పట్టణం
* కరీంనగర్‌ పట్టణం తదితర ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా హాట్‌ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా:
వీటి వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించ లేదు. అయితే ఇప్పటివరకు గుర్తించిన హాట్‌ స్పాట్లలో హైదరాబాద్‌లోని ప్రాంతాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారికి, వారి సన్నిహితులకు ఏప్రిల్ 10వ తేదీ నాటికి పరీక్షలు పూర్తి కానుండటంతో వీటి సంఖ్య 50కి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కరోనా కేసులు పెద్దగా నమోదయ్యే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం
* 206 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
* ప్రపంచవ్యాప్తంగా 64వేల 716 కరోనా మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.46లక్షలు 
* ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 5వేల 500కు పైగా కరోనా మృతి కేసులు

* అమెరికాలో 3లక్షల 11 వేల కరోనా కేసులు
* ఒక్కరోజులోనే 34వేల 196కుపైగా కేసులు
* అమెరికాలో ఒక్కరోజులోనే 1,048మంది మృతి
* అమెరికాలో ఇప్పటివరకు 8వేల 452మంది కరోనాతో మృతి

* స్పెయిన్ లో లక్ష 26వేల 168 కరోనా కేసులు, 11వేల 947 మరణాలు
* ఇటలీలో లక్ష 24వేల 632 కేసులు, 15వేల 362 మరణాలు
* జర్మనీలో 96వేల 92 కేసులు, 1,444 మరణాలు
* ఫ్రాన్స్ లో 98వేల 953 కేసులు, 7వేల 560 మరణాలు
* చైనాలో 81వేల 669 కేసులు, 3వేల 329 మరణాలు

* భారత్ లో 3వేల 671 కరోనా కేసులు, 99 మరణాలు
* దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 283
* మహారాష్ట్రలో 635 కరోనా కేసులు, 32మరణాలు
* తమిళనాడులో 485కి చేరిన కరోనా బాధితులు
* ఢిల్లీలో 445కి చేరిన కరోనా కేసులు, ఆరు మరణాలు
* కేరళలో 306 కేసులు, ఇద్దరు మృతి
* యూపీలో 234 కరోనా కేసులు, ఇద్దరు మృతి
* మధ్యప్రదేశ్ లో 154 కేసులు, 10 మరణాలు
* రాజస్తాన్ లో 200 కరోనా కేసులు, ఒకరు మృతి
* 17 రాష్ట్రాల్లో మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ నిర్ధారణ
* మొత్తం కేసుల్లో 1043 మంది మర్కజ్ వెళ్లొచ్చిన వారే

* ఏపీలో 194 కరోనా కేసులు, రెండు మరణాలు
* తెలంగాణలో 272 కరోనా కేసులు, 11 మరణాలు
* హైదరాబాద్ లో వంద దాటిన పాజిటివ్ కేసులు
* తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33
* తెలంగాణలో 23 జిల్లాలకు విస్తరించిన వైరస్