మే 9 నుంచి హరే క్రిష్ణ గోల్డెన్ టెంపుల్ లో తొలి బ్రహ్మోత్సవం

హరే క్రిష్ణ గోల్డెన్ టెంపుల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తొలి బ్రహ్మోత్సవం నిర్వహించనున్నారు. హరే క్రిష్ణ మూమెంట్ హైదరాబాద్ (హెచ్ కేఎమ్-హెచ్) ఆధ్వర్యంలో మే 9 నుంచి 13 వరకు బంజారా హిల్స్ రోడ్ నెం.12 లో ఆలయ ప్రాంగణంలో జరుపనున్నారు.
ఈమేరకు మంగళవారం (మే 7, 2019) హెచ్ కేఎమ్-హెచ్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరా చంద్ర దాస ప్రభుజి మీడియాతో మాట్లాడుతూ ఐదు రోజులపాటు సంబరాలు ఉంటాయని చెప్పారు. విస్తృతమైన వేద ఆచారాలతో కూడిన గ్రాండ్ సుదర్శన నరసింహ హోమాలు, పల్లకి ప్రాసెషన్స్, మహా అభిషేకాలు, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం, సంకీర్తనలు ఉంటాయని తెలిపారు. రాధా గోవిందా అభిషేకం, పుర్ణాహూతి మరియు మహా సంప్రోక్షణలతో బ్రహ్మోత్సవం ముగియనున్నట్లు తెలిపారు.
మే 9 న ఉదయం ములవర్ శ్రీ లక్ష్మి నరసింహస్వామికి ఉత్సవ అరంభ అభిషేకంతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. మే 13 న రాత్రి 8 గంటలకు నిర్వహించే ఎకాంత సేవాతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవం తర్వాత మే 17 నుండి మే 19 వరకు ‘నరసింహ చతుర్దశి’ వేడుకలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు.