ఆపలేము : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము

హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము
హైదరాబాద్ : తెలంగాణలో లోకల్ వార్ కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము అని కోర్టు చెప్పింది. ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేతలు వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని చెప్పింది. రిజర్వేషన్ల పిటిషన్ పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22 వ తేదీకి వాయిదా వేసింది.
Read Also : తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం
బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ల కోటా కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘం నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఆపలేము అని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఈసీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మే నెలలో 3 దశల్లో MPTC, ZPTC ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే 6, మే 10, మే 14 తేదల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్‌ని ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఓ నిర్ణయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తారు. 3 దశల్లోనూ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడే రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్