సస్పెన్స్ : సీఎం కేసీఆర్ కోర్టు ఆదేశాలు పాటిస్తారా

ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు?

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 02:27 AM IST
సస్పెన్స్ : సీఎం కేసీఆర్ కోర్టు ఆదేశాలు పాటిస్తారా

Updated On : October 19, 2019 / 2:27 AM IST

ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు?

ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ సారైనా కోర్టు ఆదేశాలు పాటిస్తారా? ప్రభుత్వం శనివారం కార్మికులను చర్చలకు పిలుస్తుందా? ఒకవేళ పిలిస్తే ప్రభుత్వం తరపున చర్చలు జరిపేదెవరు? రవాణాశాఖ కార్యదర్శిని పంపిస్తారా? లేదంటే… ఆర్టీసీకి ఎండీని నియమిస్తారా? ఇంతకీ చర్చలు జరుగుతాయా లేదా? చర్చలు జరిపినా ఎన్ని డిమాండ్లకు ఓకే చెప్పే అవకాశం ఉంది?

సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాల్సిందేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేయడంతో… చర్చల దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. శనివారం(అక్టోబర్ 19,2019) ఉదయం 10.30 గంటలకు చర్చలు జరపాలన్న కోర్టు ఆదేశాల మేరకు… చర్చల కోసం కసరత్తు చేస్తోంది. మూడు రోజుల్లోపు ఆర్టీసీ కార్మికులతో చర్చలు పూర్తిచేయాలని కోర్టు ఆదేశించడంతో… ప్రభుత్వం తరపున ఎవరు ప్రతినిధిగా వెళ్తారనేది ఉత్కంఠ రేపుతోంది. నిన్నటివరకు చర్చల ప్రసక్తే లేదని భీష్మించిన సర్కార్‌… కోర్టు ఆదేశాలతో  ఓ మెట్టు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే.. చర్చలకు ఎవరు వెళ్తారన్నదే ఇపుడు అసలు ప్రశ్న. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేకపోవడంతో కార్పొరేషన్ తరపున ప్రతినిధిగా మాట్లాడేవారు లేకుండాపోయారు. దీంతో… ఆర్టీసీ బాధ్యతలను చూస్తున్న రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మను చర్చలకు పంపిస్తుందా? లేదంటే.. ఎవరైనా కొత్త ఎండీని నియమించి వారిని చర్చలకు పంపుతుందా? లేదంటే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తుందా అన్నది సస్పెన్స్‌ గా మారింది.

మరోవైపు… తాము చర్చలకు సిద్ధమేనని కోర్టుకు చెప్పిన ఆర్టీసీ యూనియన్లు… సమ్మె వేరు.. చర్చలు వేరంటున్నాయి. తాము ముందే ప్రకటించినట్లుగా షెడ్యూల్ ప్రకారమే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని… అదే సమయంలో ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. సమ్మె విరమించి చర్చలకు వెళ్లే ప్రసక్తి మాత్రం లేదంటున్నారు.

చర్చలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం… ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కండిషన్స్ అప్లయ్ అంటోంది. ఆర్టీసీ విలీనంతోపాటు 26 డిమాండ్లను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచగా… అందులో ఆర్థిక పరమైన అంశాల డిమాండ్లు మినహా అన్ని డిమాండ్లకు ఓకే చెప్పాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కార్మిక సంఘాలు పెట్టిన డిమాండ్లలో అత్యధిక శాతం ఆర్థిక వ్యవహారాలతో ముడిపడినవే. దీంతో దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది సర్కార్.

మరోవైపు… కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశం లేదని… చర్చలు జరిపినా ఎటువంటి పరిష్కారం లభించదనే టాక్ వినిపిస్తోంది. చర్చలు జరపాలని కోర్టునుంచి లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా అందలేదని..  అవి అందిన తర్వాతే చర్చలకు కూర్చోవాలని.. లేదంటే… ఈ సమస్య పరిష్కారం కావడం సందేహమేనని కొందరు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఏ హామీ ఇవ్వడం సాధ్యంకాదని చెబుతున్నారు.