హైటెక్ సిటీకి శుభవార్త: రేపు..ఎల్లుండి ఎప్పుడైనా మెట్రో రావొచ్చు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా హైదరాబాద్ హైటెక్ సిటీ వాసులందరికీ శుభవార్తను తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైలు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల హల్‌చల్ చేస్తున్న మెట్రో హైటెక్‌సిటీలో కూడా మొదలుకానుంది. దీనికి మరెంతో సమయం లేదు. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకుని రూట్ కోసం పర్‌ఫెక్ట్‌గా సిద్ధమైంది.
Read Also : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది
హైదరాబాద్‌లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా ప్రయాణం వేగవంతం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇప్పుడిక అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ రూట్‌లో ప్రయాణించేందుకు సిద్ధమైన మెట్రో రైలు హైదరాబాద్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైపోయింది.
ఈ మేర హైదరాబాద్ మెట్రో రైల్ డిపార్టెమెంట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. ‘హైదరాబాద్ సిటీలో తిరిగేందుకు మెట్రో రైలు అన్ని విధాలా సిద్ధమైపోయింది. మరి రైలు ప్రారంభమయ్యేందుకు ఇంకా రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇదొక గొప్ప క్షణం.’ అని రాసుకొచ్చింది.
The first ever #Metrorail connectivity to Hyderabad’s IT District is now only days away. A great moment of pride for Hyderabad.#HMR #HMRL #HyderabadMetro #CorridorIII #AmeerpetMetro #HitechCityMetro #MyMetroMyPride pic.twitter.com/zXc7DSBzK5
— Hyderabad Metro Rail (@hmrgov) March 18, 2019
It’s the beginning of a new chapter in the history of Modern Hyderabad, with the #Ameerpet to #HitechCity metro rail stretch, all set to be flagged off soon.#HMR #HMRL #HyderabadMetro #AmeerpetMetro #HitechCityMetro #MyCityMyMetro pic.twitter.com/Ms47LuQpSG
— Hyderabad Metro Rail (@hmrgov) March 18, 2019