హెచ్‌సీయూ విద్యార్ధినికి అమెరికాలోని ఐదు వర్శిటీల్లో అడ్మిషన్

  • Published By: vamsi ,Published On : March 6, 2020 / 02:39 AM IST
హెచ్‌సీయూ విద్యార్ధినికి అమెరికాలోని ఐదు వర్శిటీల్లో అడ్మిషన్

Updated On : March 6, 2020 / 2:39 AM IST

అమెరికాలోని ఐదు యూనివర్శిటీల్లో పీహెచ్‌డీ చేసేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్‌ శిల్పి మండల్‌ ఎంపికైంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ పీఆర్‌ఓ ఆశీష్‌ జెకాబ్‌ వెల్లడించారు. యూనివర్సిటీలోని మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ 5వ సంవత్సరం విద్యార్థిని శిల్పి మండల్‌ పీహెచ్‌డీ చదివేందుకు అమెరికాలోని 5 యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ లభించింది. 

అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలైన ఎమోరీ యూనివర్సిటీ (80), యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా (107), యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌ (351), యూనివర్సిటీ ఆఫ్‌ ఒక్లహోమా (401), లౌసియాన స్టేట్‌ యూనివర్సిటీ (501)లు ఆమెకు పీహెచ్‌డీ చదవేందుకు ఆఫర్ చేసినట్లు యూనివర్శిటీ ప్రకటించింది. 

అలాగే ఇటీవల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ ప్రోగ్రాం బయాలజీ విద్యార్థి అనన్యకు అరుదైన గౌరవం లభించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆమె ప్రతిష్టాత్మకమైన ఆస్ర్టేలియా నేషనల్‌ యూనివర్సిటీ ఫ్యూచర్‌ రిసెర్చ్‌ టాలెంట్‌ అవార్డు 2020కు ఎంపికయ్యారు. సిస్టమ్స్‌ అండ్‌, కంప్యుటేషన్‌ బయాలజీ విభాగం నామినేట్‌ చేసిన విద్యార్థుల్లో అనన్య ఒకరు.

See Also | SBI ఖాతాలోకి YES BANK!