వారసుడు కావాలి : మగపిల్లాడు పుట్టలేదని ట్రిపుల్ తలాక్ 

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 04:58 AM IST
వారసుడు కావాలి : మగపిల్లాడు పుట్టలేదని ట్రిపుల్ తలాక్ 

Updated On : November 19, 2019 / 4:58 AM IST

ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా..ముస్లిం మహిళలకు కష్టాలు తీరటంలేదు. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి..ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ క్రమంలో హైదరాబాద్ లో  కొడుకుని కని ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు.దీంతో  బాధిత మహిళ మెహ్‌రాజ్ బేగం..పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండవ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందనీ.. మగపిల్లాడిని కనలేదని..నా భర్త నాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని వాపోయింది. ఇప్పటికే మరో యువతితో సంబంధం ఉన్న తన భర్త కొడుకుని కని ఇవ్వలేదనీ..తన వంశానికి వారసుడు కావాలని నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నువ్వు నాకు అక్కరలేదని చెప్పి..ట్రిపుల్ తలాక్ అని చెప్పి వదిలించుకోవటానికి యత్నిస్తున్నాడనీ..తను మరో పెళ్లి చేసుకుంటున్నాడని వాపోయింది. నాకు న్యాయం చేయమని కోరుకుంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతన్ని శిక్షించి..తనకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. మెహ్‌రాజ్ బేగం ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

కాగా..అర్థం పర్థం లేని చిన్న చిన్న కారణాలతో భార్యల్ని ట్రిపుల్ తలాక్ పేరుతో వదిలించుకుని మరో పెళ్లికి సిద్దపడుతున్నారు కొందరు.  కొన్ని రోజుల క్రితం తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. బిర్యానీ చేయలేదనీ ఓ భర్తా..కూర బాగా ఉండలేదనీ మరొకరు..ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న సందర్భాలు ఎన్నో..ఎన్నెన్నో. ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా..ముస్లిం మహిళలు దీనికి బలైపోతునే ఉన్నారు.