హైదరాబాద్‌లో భారీగా తగ్గిపోయిన పోలింగ్ శాతం

హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం సికింద్రాబాద్‌లో దారుణంగా పడిపోగా ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
ఇదిలా ఉంటే టాప్ పొజిషన్‌లో మాత్రం మెదక్‌లో మాత్రం 68.60 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో భువనగిరి 68.25 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్ 11న నమోదైన పోలింగ్ వివరాలను బట్టి మిగిలిన నియోజకర్గాల్లో వివరాలిలా ఉన్నాయి.
మెదక్ 68.60
భువనగిరి 68.25
కరీంనగర్ 68
ఖమ్మం 67.96
జహీరాబాద్ 67. 80
ఆదిలాబాద్ 66.76
పెద్దపల్లి 59.24
నిజామాబాద్ 54.20
మల్కాజ్‌గిరి 42.75
సికింద్రాబాద్ 39.20
హైదరాబాద్ 39. 49
చేవెళ్ల 53.80
మహబూబ్‌నగర్ 64.99
నాగర్ కర్నూల్ 57. 12
నల్గొండ్ 66.11
వరంగల్ 60
మహబూబాబాద్ 59.90