వెంటిలేటర్ పై మధులిక ఆరోగ్యం

హైదరాబాద్: ప్రేమ పేరుతో వేధిస్తు దాడి చేసిన ఘటనలో దారుణంగా కత్తిపోట్లకు గురైన మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని యశోదా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్న డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నామనీ..ప్రస్తుతం కోమాలో ఉందని..వైద్యానికి స్పందించని పరిస్థితిలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఉందని తెలిపారు. వైద్యులు చెప్పారు. మధులిక తల, వీపు, చేతులపై 15 కత్తిపోట్లు ఉన్నాయనీ..తీవ్రంగా రక్తస్రావం కావటంలో పరిస్థితి విషమించిందన్నారు. ఈ ఘటనలో మధులిక ఎడమ చేయి చిటికెన వేలు పూర్తిగా తెగిపోయింది. గాయాలైనట్టు చెప్పారు. మధులిక ఆరోగ్య పరిస్థితిపై 48 గంటల నుండి 72 గంటల తర్వాత స్పష్టత ఇస్తామని యశోద వైద్యులు ప్రకటించారు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో భరత్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థిని మధులికపై కక్ష పెంచుకుని అదను చూసి కొబ్బరి బొండాల కత్తితో దాడిచేశాడు. హైదరాబాద్ లో బర్కత్‌పుర ప్రాంతంలో బుధవారం జరిగిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.