బయటకు రావొద్దు.. అత్యవసరమైతే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 04:14 PM IST
బయటకు రావొద్దు.. అత్యవసరమైతే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!

Updated On : October 14, 2020 / 4:29 PM IST

Hyderbad heavy rains : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి.

నగరంలో మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.



ఈ పరిస్థితుల్లో ఎవరూ ఇంట్లో నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నగర ప్రజలను కోరారు.

నగరంలో వరద పరిస్థితులకు సంబంధించి అధికారులతో మేయర్ సమీక్ష జరిపారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కురుస్తున్నాయి.



నగరంలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు GHMC, DRF, విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని చెప్పారు. అత్యవసర సేవలకోసం నగర ప్రజలు 040-211111111 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

విపత్తు నిర్వహణశాఖ నంబర్‌ 9000113667, చెట్ల తొలగింపు సిబ్బంది నంబర్‌ 6309062583, MCH విపత్తు నిర్వహణశాఖ నంబర్‌, 9704601866, విద్యుత్ శాఖ నంబర్‌ 9440813750, DRF నంబర్‌ 040-29555500, NDRF నంబర్‌ 8333068536లకు ఫోన్‌ చేయాలని మేయర్ రామ్మోహన్ కోరారు.