సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తా : సిరివెన్నెల
పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు.

పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు.
హైదరాబాద్ : సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. పద్మశ్రీ అవార్డుకు తనను సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆయన తెలిపారు. తెలుగు చలన చిత్ర మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. లక్షల మంది తెలుగువారు నాకు పద్మశ్రీ రావాలని కోరుకున్నారని తెలిపారు.
’నా సాహితీ వ్యవసాయానికి అందిన ఫలసాయం పద్మశ్రీ’ అని అన్నారు. ’ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా పాటలు రాశా’ అని పేర్కొన్నారు. ’నాకు కఠినమైన పాట రాసేంత భాష రాదు’ అని అన్నారు. సినిమా వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని.. సినిమా అనేది అద్దం లాంటిదని అభిర్ణించారు. సినిమా అనేది అత్యంత ధర్మమైన వ్యాపారమన్నారు.