kolors: హీరోయిన్ ఇంట్లో I-T దాడులు

kolors: హీరోయిన్ ఇంట్లో I-T దాడులు

Updated On : October 31, 2019 / 4:24 AM IST

హెల్త్ కేర్ అండ్ వెల్ నెస్ సెంటర్ కలర్స్ సంస్థపై బుధవారం ఐటీ దాడులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 49బ్రాంచుల్లో ఒకే సారి దాడి చేశారు. కర్ణాటకలోని 35 ప్రాంతాలతో పాటు, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో సోదాలు నిర్వహించారు.  ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరోయిన్ రాశి ఇంట్లో, కలర్స్ డైరక్టర్ దేవుల విజయ్ కృష్ణ ఇంట్లో తనిఖీలు జరిగాయి. 

లక్షల్లో జరిగిన అమ్మకాలకు లెక్కలు చూపించడం లేదని వచ్చిన ఆరోపణల మేరకు ఐటీ శాఖ స్పందించింది. రాశికి, కలర్స్ డైరక్టర్ దేవుల విజయ్ కృష్ణకు బంధుత్వం ఉందని తెలిసి ఆమె ఇంటిపైనా దాడులు నిర్వహించారు. 16సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న విజయ్ కృష్ణ పలు ఉత్పత్తులు మొదలుపెట్టారు. 

కలర్స్ ఫుడ్ సైన్సెస్ ఎల్ఎల్పీ, కలర్స్ హెల్త్ కేర్ ఫ్రాంచైజీస్ సర్వీసెస్ ఎల్ఎల్పీ, కలర్స్ బ్యూటీ అండ్ వెల్ నెస్ అకాడమీ ఎల్ఎల్పీ, కలర్స్ అడ్వాన్స్‌డ్ డెంటిస్టీ ఎల్ఎల్పీ, కలర్స్ హెల్త్ కేర్ ఎల్ఎల్పీ, కలర్స్ హెల్త్ కేర్ ఇండియ ప్రైవేట్ లిమిటిడ్ అన్ని కంపెనీల పైనా తగు చర్యలు తీసుకోనున్నారు. 

ఈ సందర్భంగా ఐటీ అధికారి మాట్లాడుతూ.. కొన్ని బ్రాంచుల్లో జరిగిన పేమెంట్లకు సరైన లెక్కలు చూపించలేదని తెలిసింది. దీంతో సోదాలు నిర్వహించాం. అక్కడ ఉన్న మెషీన్లు, కంప్యూటర్లు, డాక్యుమెంట్లను సీజ్ చేశాం అని తెలిపారు. 49బ్రాంచుల్లో 15వందలకు పైగా నిపుణుల సాయంతో 10లక్షల కస్టమర్లకు సేవలందించింది కలర్స్. 

విజయవాడ, విశాఖపట్టణం కన్స్యూమర్ కోర్టులో కలర్స్ సంస్థకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రంభ, రాశిలు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు రావడంతో వారిని అటువంటి ప్రకటనలు చేయొద్దంటూ కోర్టు ఆర్డర్ ఇచ్చింది.