ఐటీ గ్రిడ్స్ కేసు : సిట్ విచారణకు హాజరుకాని అశోక్

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 11:26 AM IST
ఐటీ గ్రిడ్స్ కేసు : సిట్ విచారణకు హాజరుకాని అశోక్

Updated On : March 13, 2019 / 11:26 AM IST

హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు ఆ సంస్థ సీఈవో అశోక్ స్పందించలేదు. మార్చి 13 బుధవారం అశోక్.. సిట్ విచారణకు హాజరు కావాల్సివుంది. విచారణకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. సిట్ విచారణకు హాజరుకాని ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిట్ రంగం సిద్ధం చేసింది. అశోక్ వ్యవహారంలో సిట్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నది.
Read Also : షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!

అశోక్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది సిట్. అతని కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు ప్రత్యేక టీమ్ లుగా ఏర్పడి గాలిస్తున్నాయి. అశోక్ కు సంబంధించిన కాల్ డేటాతో పాటు లొకేషన్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందంటున్నారు సిట్ అధికారులు.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు