కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానంటూ బహిరంగంగా ప్రకటించిన మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడారు.

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 04:40 AM IST
కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం

Updated On : May 28, 2020 / 3:41 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానంటూ బహిరంగంగా ప్రకటించిన మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానంటూ బహిరంగంగా ప్రకటించిన మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తమకు భయం లేదని, గౌరవం మాత్రమే ఉందని నాగబాబు అన్నారు. ఇప్పటివరకు చూపించింది టీజర్ మాత్రమేనని.. మే 23 ఫలితాల తర్వాత అసలు సినిమా ఉంటుందని నాగబాబు అన్నారు.
Also Read : నోటికొచ్చినట్లు ఆరోపిస్తే పరువునష్టం దావా వేస్తాం : కేటీఆర్

తెలంగాణలో ఇంటర్మీడియల్ ఫలితాలపై స్పందించని వైఎస్ జగన్.. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్‌కు విద్యార్ధుల సమస్య గురించి కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము లేదని, తెలంగాణలో పనిచేసే దమ్ము, ధైర్యం జవాబుదారితనం ఒక్క జనసేనకు మాత్రమే ఉన్నాయని అన్నారు.

మరోవైపు నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు.. ఏపీలో జనసేన గెలుపు కోసం అభిమానులు, కార్యకర్తలు రూ.10 ఆశించకుండా పనిచేశారని అన్నారు. అటువంటివారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపురం ఎంపీగా ఎన్నికైనా, కాకపోయినా.. ఈ నియోజకవర్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
Also Read : వల్లభనేని వంశీ ఇంటికి వచ్చాడు.. బెదరిస్తున్నాడు: వైసీపీ అభ్యర్ధి