నోటికొచ్చినట్లు ఆరోపిస్తే పరువునష్టం దావా వేస్తాం : కేటీఆర్

ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హెచ్చరించారు.

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 03:09 AM IST
నోటికొచ్చినట్లు ఆరోపిస్తే పరువునష్టం దావా వేస్తాం : కేటీఆర్

ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హెచ్చరించారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హెచ్చరించారు. రూ. 4.30 కోట్ల టెండర్లలో రూ. 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కాబట్టి బట్ట కాల్చి మీద వెయ్యాలని కొందరు ఏది పడితే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం

ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా అని వాపోయారు. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు ఒక బఫూన్‌ రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు, మీడియా సంయమనం పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. అన్నీ మంచిగా జరుగుతుంటే కొందరికి మనసున పడడం లేదన్నారు. 

ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే ఇంటర్‌ ఫలితాల సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయని తెలిపారు. తప్పులు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా సరిదిద్దుకుంటుందన్నారు. ఒక తండ్రిగా తనకూ బాధ ఉందని, పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు అన్నారు. అందుకే ఎవరూ తొందరపడవద్దని సీఎం కేసీఆర్‌ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారని తెలిపారు.

ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖలోని బోర్డులో జరిగిన విషయానికి ఐటీ శాఖతో సంబంధం ఉండదన్నారు. అందులో ఏం జరిగిందో తెలియదని విచారణలో తేలుతుందని తెలిపారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థకు టెండర్‌ దక్కితే తప్పును తనకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
Also Read : చిల్లర రాజకీయాలు : లక్ష్మీస్ NTR మూవీపై ఫస్ట్ టైం స్పందించిన చంద్రబాబు