Secunderabad fire accident: మంటలు ఇంకా అదుపులోకి రాలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Secunderabad fire accident: మంటలు ఇంకా అదుపులోకి రాలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Updated On : January 20, 2023 / 11:34 AM IST

Secunderabad fire accident: సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంటలు అదుపు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఇవాళ ఆయన అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అగ్ని ప్రమాదం ఘటనలపై సర్వేలు చేయాల్సి ఉందని చెప్పారు. అగ్ని ప్రమాదాలపై సర్కారు దృష్టి సారించాలని ఆయన అన్నారు.

భవనంలో మంటలు చెలరేగిన నేపథ్యంలో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానిక ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీకి నిధులు కావాల్సి ప్రతి సారి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడం సరి కాదని చెప్పారు. అగ్ని ప్రమాదాలకు అక్రమ నిర్మాణాలే కారణాలుగా నిలుస్తున్నాయని తెలిపారు.

అగ్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరుగుతున్నాయని అన్నారు. కాగా, అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని ఇంజనీరింగ్ విభాగం నిపుణులు పరిశీలిస్తున్నారు. వారంతా వరంగల్ ఎన్ఐటీకి చెందినవారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఆ భవనం చుట్టుపక్కల ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తొలిసారి బ్లాక్ జాకెట్ ధరించిన రాహుల్..