కంటోన్మెంట్ బోర్డును GHMCలో కలుపుతాం – KTR

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 01:25 PM IST
కంటోన్మెంట్ బోర్డును GHMCలో కలుపుతాం – KTR

Updated On : April 3, 2019 / 1:25 PM IST

కంటోన్మెంట్ బోర్డును GHMC లో కలిపే ప్రయత్నం చేస్తామని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. కంటోన్మెంట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కారం కావాలంటే..ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ఎంపీలుండాలని అన్నారు. ఇక్కడ 17 కోట్ల రూపాయల బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తు చేశారు. కంటోన్మెంట్‌‌ను హైదరాబాద్‌లో కలిపితే రోజూ నీళ్లు ఇచ్చేందుకు తాము కృషి చేయడం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గడువు దగ్గర పడటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పీడ్ పెంచారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఏప్రిల్ 03వ తేదీ బుధవారం సిఖ్ విలేజ్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. 

ఇక్కడ ఆరు లైన్ల స్కైవే కడుదామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ కంటోన్మెంట్ అధికారులు, రక్షణశాఖ మంత్రులు అనుమతినివ్వలేదన్నారు. వంద ఎకరాలు ఇస్తే..100 ఎకరాలు శామిర్ పేటలో భూమి ఇస్తామని చెప్పామన్నామని..అయినా సానుకూలంగా స్పందించలేదన్నారు. మొదట మనోహర్ పారికర్ తరువాత జైట్లీ అనంతరం నిర్మలా సీతారామన్‌లను అడిగినట్లు..అయినా వారు స్పందించలేదన్నారు. 

రక్షణ శాఖకు చెందిన స్థలాల్లో పేదలు నివాసం ఉంటున్నారని, వీరికి కూడా పట్టాలిస్తామని..ఇందుకు భూమికి భూమి ఇస్తామని చెప్పినా రెస్పాండ్ అవ్వలేదన్నారు. రోడ్లు బంద్ చేసి సమస్యలను సృష్టిస్తున్నారని తెలిపారు. 16 ఎంపీలను పంపిస్తే..సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. ఢిల్లీ ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయించేది టీఆర్ఎస్ కావాలని..ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలని..ఇదంతా 16 మంది ఎంపీలు గెలిస్తేనే సాధ్యమౌతుందన్నారు కేటీఆర్.