Kumari Aunty : కుమారి ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. తన భర్త ఇచ్చిన ప్రేమలేఖను ఏం చేసిందో తెలుసా?

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌తో ఫేమస్ అయిన కుమారీ ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. రీసెంట్‌గా ఆమె ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kumari Aunty : కుమారి ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. తన భర్త ఇచ్చిన ప్రేమలేఖను ఏం చేసిందో తెలుసా?

Kumari Aunty

Kumari Aunty : కుమారీ అంటీ ఫుడ్ స్టాల్ పోలీసులు తొలగించడం.. దీనిపై చర్చ జరగడం.. అందరూ ఆమెకు అండగా నిలబడటం.. చివరికి తెలంగాణ సర్కార్ తిరిగి ఆమె స్టాల్ పెట్టుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. మళ్లీ కుమారీ ఆంటీ స్టాల్ ప్రారంభించడం ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. అయితే కుమారీ ఆంటీ జీవితంలో అందమైన ప్రేమ కథ ఉందండోయ్. ఇటీవల ఆ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు మీడియాకు షేర్ చేసుకున్నారు.

kumari aunty love story

kumari aunty love story

Kumari Aunty: ఎవరీ కుమారి ఆంటీ? ఎందుకింత క్రేజ్‌? ఆమె మాటల్లోనే వినండి..

కుమారీ ఆంటీ అసలు పేరు దాసరి కుమారి. కైకలూరు సమీపంలోని తారమకొల్లులో పుట్టారట. 4వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్లేవారట. పొలం పనులతో పాటు గుడివాడ మాంటిస్సోరి స్కూల్‌లో టైలరింగ్ నేర్చుకున్నారట. అలా టైలరింగ్ నేర్చుకునే క్రమంలో తనను చూసి ఇష్టపడి వ్యక్తి ఇంట్లో వారితో మాట్లాడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లాడారట. తాజాగా వీరి ప్రేమ కథ మీడియాలో వైరల్ అవుతోంది. కుమారి ఆంటీకి 2004 లో పెళ్లైందట. వారికి కుమారుడు, కుమార్తె ఇద్దరు పిల్లలు.

Sundeep Kishan : కుమారి ఆంటీకి అండగా నిలుస్తానన్న సందీప్ కిషన్..

కుమారి ఆంటీకి పెళ్లైన తర్వాత భర్త ఎంతో ప్రేమతో ఇచ్చిన ప్రేమ లేఖను అందంగా ఫ్రేమ్ కట్టించుకుని గోడకి పెట్టుకున్నారామె. ‘నిన్ను చూసిన క్షణం మరువలేనంది నా హృదయం .. నా మనసు దోచుకున్న రూపమా.. నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తోంది నా మనసు.. నీ రాక కోసం ఎదురుచూస్తోంది నా ప్రాణం’ అంటూ భర్త రాసిన అక్షరాలను పదిలంగా దాచుకున్నారు. పెళ్లైన కొత్తలో అసలు వంట చేయడం సరిగా రాని కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తూ పాపులర్ అయిపోయారు. కొంతకాలం సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట పని చేశారట.  ఆ సమయంలో హేమచంద్ర  తల్లి శశికళ వెజ్‌లో ఎన్ని రకాలు వండవచ్చో నేర్పించారని కుమారీ ఆంటీ చెప్పారు. 13 సంవత్సరాలుగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె వ్యాపారాన్ని పోలీసులు అడ్డుకోవడం.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆమె షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆమె స్టాల్‌కి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతోంది.