తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరఠ్వాడా, మధ్య మహా రాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్, మెదక్ లో 40.8 డిగ్రీల ఉష్ణగ్రత నమోదు అయింది. మహబూబ్ నగర్ 39.6, హైదరాబాద్ 38.9, ఖమ్మం 38.8, భద్రాచలం 38.4, రామగుండం 38.0, నిజామాబాద్ 37.4, హన్మకొండ 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.