కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి : పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో రేణుక

ఖమ్మం లోక్ సభ సీటుకు వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 08:57 AM IST
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి : పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో రేణుక

ఖమ్మం లోక్ సభ సీటుకు వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో లోక్‌సభ టికెట్ల పంచాయతీ మొదలైంది. ఖమ్మం లోక్‌సభ సీటుకు వి హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలతో ఆమె చర్చిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టే కుట్ర చేస్తున్నారని వాపోయారు. ఒకవేళ ఖమ్మం లోక్‌సభ సీటు తనకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదనే మెసేజ్‌ను రేణుకా చౌదరి అధిష్టానానికి ఇవ్వబోతున్నట్టు సమాచారం.