దీపావళికి షాక్ : మరో 10రోజులు LPG నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఎల్ పీజీ సిలిండర్లు మరో 10రోజులు నిలిపివేయనున్నారు. ముంబై,కొచ్చిలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లోసాంకేతికసమస్యల కారణంగా ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్ లోని చార్లపల్లి ప్లాంట్‌కు రైళ్ల ద్వారా ఎల్‌పిజి సరఫరాకు అవాంతరం ఏర్పడింది.
దీని ఫలితంగా సిటీలోని చాలా మంది ప్రజలు బుక్ చేసిన సిలిండర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎల్ పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం కావడానికి మరో కారణం ఏమిటంటే గ్యాస్ ఎజెన్సీలలోని డెలివరీబాయ్స్ దసరా సందర్భంగా సెలవులపై ఇళ్లకు వెళ్లడం. అయితే నగరంలోని అనేక ప్రాంతాల్లోని వినియోగదారులను గ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా వెయిట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరో 10 రోజులు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది.