మధులిక హెల్త్‌బులెటిన్ : కండీషన్ క్రిటికల్

హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక హెల్త్ కండీషన్‌పై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని..పలు ఆపరేషన్లు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం మధ్యాహ్నం మీడియాకు ఆరోగ్య పరిస్థితి..చేస్తున్న చికిత్స గురించి వైద్యులు వెల్లడించారు.
మధులిక బీపీ లెవెల్స్ కొంత కంట్రోల్ అయ్యాయని…అయితే ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు వెల్లడించారు. మధులికకు మొత్తం 15చోట్ల తీవ్రగాయాలయ్యాయని…కత్తి చాలా తుప్పుపడి ఉండడం వల్ల చాలా ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ఆమెను కాపాడటానికి వంద శాతం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై చికిత్స అందించడం జరుగుతుందని, బీపీ అసలు రికార్డ్ కాలేదని..ప్రస్తుతం కొంత మెరుగైనట్లు కనిపిస్తోందని తెలిపారు.
ఎంఆర్ఐ, ఇతర పరీక్షలు చేయించినట్లు…బ్రెయిన్ కింది భాగంలో కొంత దెబ్బ తగిలిందని..దీనివల్ల రక్తప్రసారం సరిగ్గా కావడం లేదన్నారు. ఒక ఎముక విరిగి మెదడులోకి వెళ్లిందని..దీని వల్ల ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందన్నారు. మధులిక ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బర్కత్‌పురలో ప్రేమోన్మాది భరత్.. మధులికపై కత్తితో దాడి చేశాడు.