కరోనాపై యుద్ధం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల భార్య రూ.2కోట్లు విరాళం

కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి ప‌లువురు అండగా నిలుస్తున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 10:52 AM IST
కరోనాపై యుద్ధం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల భార్య రూ.2కోట్లు విరాళం

Updated On : March 24, 2020 / 10:52 AM IST

కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి ప‌లువురు అండగా నిలుస్తున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు.

కరోనా వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి ప‌లువురు అండగా నిలుస్తున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. టాలీవుడ్ హీరో నితిన్‌ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ(మార్చి 24,2020) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించాడు నితిన్. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల భార్య సైతం అదే బాటలో నడిచారు. ఆమె కూడా ప్రభుత్వానికి భారీ విరాళం ఇచ్చారు.

కరోనా నివారణ చర్యలకు గాను ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్ల డొనేషన్ ఇచ్చారు. అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు. కరోనా నిరోధానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు.

అసలే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. పైగా కరోనా కట్టడి కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు స్పందిస్తున్నారు. మానవత్వం చాటుకుంటున్నారు. మేము సైతం అంటూ కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు.

See Also | షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు