ఓటు వేసిన MIM MP అసదుద్దీన్ ఓవైసీ

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 04:40 AM IST
ఓటు వేసిన MIM MP అసదుద్దీన్ ఓవైసీ

 హైదరాబాద్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంలో సార్వత్రిక ఎన్నికలు తొలి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలి విడతలో 20 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్న క్రమంలో తెలంగాణలో ప్రముఖ నాయకులు,సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  

 ఈ క్రమంలో ఇప్పటికే సిద్దిపేటలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, నారాయణపేట్ జిల్లా శేరి వేంకటాపుర్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా వల్లూర్ గ్రామంలో ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. అబ్రహం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ క్రమంలో అక్కడ కొన్ని ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.