తెలంగాణలో ఓటు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భార్య పుష్ప, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మెల్యే హరీశ్ రావు, సూర్యాపేటలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి దంపతులు ఓటేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన స్వగ్రామం నిర్మల్ జిల్లాలోని ఎల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటేశారు.
సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, నారాయణపేట్ జిల్లా శేరి వేంకటాపుర్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా వల్లూర్ గ్రామంలో ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. అబ్రహం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ క్రమంలో అక్కడ కొన్ని ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.