Mercedes Benz GLS : 18 ఏళ్లు కూడా లేవు.. కోటి రూపాయలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ GLS ఎలా కొన్నాడు? .. ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

వయసు చూస్తే 18 నిండ లేదు. బెంజ్ కారు కొనడానికి షోరూంకి వచ్చాడు. అది కోటిపైన ఖర్చుపెట్టి. వివరాలు పూర్తిగా తెలియలేదు కానీ.. హైదరాబాద్ లో ఓ బాలుడి హడావిడి చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Mercedes Benz GLS : 18 ఏళ్లు కూడా లేవు..   కోటి రూపాయలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ GLS ఎలా కొన్నాడు? .. ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Minor bought Mercedes Benz GLS

Updated On : May 12, 2023 / 2:17 PM IST

Minor bought Mercedes Benz GLS : పట్టుమని 18 ఏళ్లు కూడా లేవు. హైదరాబాద్‌లో శ్రీనివాస రెడ్డి అనే బాలుడు Mercedes-Benz GLS కారు డెలివరీ తీసుకుంటున్నట్లు వచ్చిన వీడియో వైరల్ గా మారింది. అంతే నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

Kanpur: ఆగి ఉన్న బైక్‌‌లను కారుతో ఢీకొట్టిన మహిళ.. వీడియో వైరల్
హైదరాబాద్‌లో శ్రీనివాస్ రెడ్డి అనే బాలుడు తన బాడీ గార్డ్స్‌తో కలిసి Mercedes-Benz GLS 400 కొనుగోలు చేయడానికి షోరూంకి వచ్చాడు. అతనితో కుటుంబసభ్యులు ఎవరూ కనిపించలేదు. డెలివరీ తీసుకుని షోరూం నుంచి బయటకు వెళ్లేముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అంత ఖరీదైన కారు కొనడానికి అతను అర్హుడా? ఎలా కొనుగోలు చేసాడు? అని ప్రశ్నిస్తున్నారు.

Shah Rukh Khan : పఠాన్ సక్సెస్.. కొత్త కారుతో ముంబైలో షికార్లు కొట్టిన షారుఖ్.. కారు ధర తెలిస్తే షాక్!
శ్రీనివాస్ రెడ్డి మైనర్ లాగ కనిపిస్తున్నాడని.. కారును నడపడానికి అర్హుడా అని నెటిజన్లు సందేహిస్తున్నారు. అతనికి తండ్రి, లేదా తాత బహుమతిగా ఇచ్చారా? అనేది కూడా వాళ్ల డౌట్. ఇక అతను కొనుగోలు చేసిన SUV మెర్సిడెస్-బెంజ్ GLS 400d ధర రూ. 1.29 కోట్లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఏరకంగా వైరల్ అవ్వాలా? అని ఆలోచించేవాళ్లు ఎక్కువై పోయారు. అలా కూడా ఈ వీడియోని పోస్ట్ చేసి ఉంటారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.